Friday, December 08, 2006

Happy sankraanti !!

సంక్రాంతి అనే కన్నా "పెద్ద పండుగ" అనడం అలవాటు ఇంట్లో. ఇది పెద్ద వాళ్ళకి "పెద్ద" ఖర్చు పెట్టెంచే పండుగ కనుక ఆ పేరు వచ్చింది అంటాను నేను. ఇంటిల్లి పాదికి కొత్త బట్టలు, ఒక జత కాదు, రేండేసి లేక మూడేసి ఒక్కోసారి. దానాలు, పూజలు, పునస్కారాలు ఎలాగూ ఉంటాయే. దశమ గ్రహాలు ఉంటే, ఇంకా మంచి బట్టలు పెట్టాలి. ఇవి కాక "సరదా" పేకాట లో డబ్బులు పొతే అది కూడా ఖర్చే కదా!!

తలుచుకుంటే రధం ముగ్గుల దగ్గర నించి ముక్కునమ నాడు సత్తెమ్మ తల్లి సంబరం వరకు గుర్తుకు వస్తాయి. ఇంకా కొంచం ప్రయత్నంస్తే ఒక్కో సారి పండుగ తరువాత వచ్చే Half Yearly పరీక్షలు ఏడుపు తెప్పిస్తాయి కూడా.

చిన్ని చిన్ని సందులు మొదట్లో కాపలా కాసి, అక్కలు, అమ్మలక్కలు రధం ముగ్గులు వేస్తుంటే వాటికి వింత వింత పేర్లు పెట్టే విషయం రాయనా, లేక భోగి మంటకి రిక్షా వాళ్ళు డబ్బులు అడగాడానికి వస్తే, ఈ సారి ఎంత పెద్ద మంట వేస్తారో అని నాన్నగారు అడగడం గురించి రాయానా, లేక హరిదాసు కాని, గంగిరెద్దులు వాడు వస్తే అమ్మ ఇచ్చిన బియ్యం వాళ్ళకి ఇచ్చెస్తే వాళ్ళు త్వరగా పక్కంటికి వెళ్ళిపోతాడేమోనని, పక్క గూట్లో దాచేసే సరదా గురించి రాయనా !!. ఎంత రాసినా తరగని జ్నాపకాలు, సంతొషాలు.

ఇవి అన్ని ఒక ఎత్తు అయితే, చిన్నా రావు tailor తొ గోడవ పడడం ఒక ఆనవాయతి. మూడు జతలలో వాడు ఎప్పుడు మొదటిది భొగి నాడు ముందర రాత్రి 9 గంటలకు ఇస్తే, మిగతా రెండు రోజుల బట్టలు పండుగ నాడు ఇచ్చేవాడు. ఇలా అని ఇంటి దగ్గర్లో వున్న వాడికి ఇస్తే, అన్నయ్యది నాకు, నాది అన్నయ్యకు కుట్టేసాడు. చిన్నోడిని కదా, త్వరగా కొపం వస్తే, అమ్మ వాడి మీద వుత్తిత్తి కొపం చూపించి, అన్న గాడి షర్టుకి అసలు కాజాలే కుట్టలేదు అని చూపించి, నన్ను సముదాయంచింది.

పండుగ అన్నకా పిండి వంటలు లెకుండా ఉంటే బొత్తిగా మరీ బావుండదు. మూడు రోజులు మూడు రకాల sweets, మూడు రకలా కారాలు. పులిహోర, బొబ్బట్లు భోగి రోజు అయితే, గారెలు పరవాణ్ణం సంక్రాంతి నాడు. ఆఖరి రోజు, కనుమ నాడు పని వాళ్ళకు కూడా పెట్టడానికి, కొంచం ఎక్కువ మోతాదులో నే తయారు అయ్యేవి.

ఇంక గాలి పటాలు, పేకాటలు, వున్న మూడు సినిమా హాలుల మధ్య పరిగెత్తే జనాల గురించి రాస్తూ పొతే, ఇంకొ పెద్ద పండుగ వచ్చెస్తాది.......

సంక్రాంతి శుభాకాంక్షలతో

No comments: